విలేఖరి : నమస్కారమండి రావు గారు!(ముష్టివాడితో)
భిక్షగాడు : నమస్కారమండి.
విలేఖరి : చూడండి రావు గారు! మీరు ఈ వృత్తిని ఎప్పడి నుండి మొదలుపెట్టారు?
భిక్షగాడు : నేనండి 3వ తరగతి చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం అందరు కలిసి భోజనం చేస్తుంటే నాకు ఆకలి వేసేది కాని నాకు భోజనం పెట్టేవారు లేక అప్పడి నుండి అడుక్కుతినడం మొదలుపెట్టాను.
విలేఖరి : మీరు ఈ భిక్షాటన వృత్తినే ఎంచుకోవడానికి గల కారణాలు ఎమైనా ఉన్నాయా?
భిక్షగాడు : కారణాలేమంటే నండీ, చిన్నప్పటి నుండి అలవాటుంది అంతేకాక అడుక్కుతినడంలోని ఆనందమే వేరు. రోజుకు రకరకాల కూరలు మరియు పంచభక్ష పరమాన్నాలు భుజించినట్టుగా ఉంటుంది. ఒళ్ళు వంచి కష్టపడే పని తప్పుతుంది. సుఖంగా తిండి దొరుకుంది. ఒళ్ళువంచి కష్టం చేసి తినే పాడు అలవాటు మన వంశంలోనే ఉండవద్దు. అని మా తాతగారైన భిక్షారావు శపధం చేసాడట.
విలేఖరి : మీరు ఈ ముష్టి సంస్థ ఉద్యోగ నియామకాల్లో ఎమైనా ఇంటర్వూలు నిర్వహిస్తారా!
భిక్షగాడు : తప్పకుండా నండీ!ఉదా!మన దేశ జనాభాలో భిక్షగాళ్ళ సంఖ్య ఎంత? నేటి సమాజంలో భిక్షగాడి పాత్ర ఎంతవరకు? భిక్షాటన మొదలు ఎక్కడ ప్రారంభం అయ్యింది? మనదేశంలో ఆల్ ఇండియా అడుక్కునే సంఘం ఎక్కడుంది? ఇలా చిన్న - చిన్న ప్రశ్నలే వేస్తారు.
విలేఖరి : ఈ మద్యలో ఎమైనా పోస్టులు పెంచే అవకాశం ఉందా?
భిక్షగాడు : ఎందుకండీ మీకు ఈ విలేకరి ఉద్యోగంలో పొట్టగడవడం లేదా! ఏంటీ?
విలేఖరి : మీ ముష్టి సంఘం తరపున ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్లు కోరాలనుకుంటున్నారా?
విలేఖరి : ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా?
భిక్షగాడు : డిమాండ్స్ అంటే లేకపోలేదు. ప్రతి భిక్షగాడికి ప్రభుత్వం ఒక తుపాకీని మంజూరు చేయాలి. ఎందుకంటే ప్రజలకు ఈ మధ్య బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. మాపై ఎటువంటి కేసులు ఉండకూడదు. మేము ముష్టివారి మీటింగులకు వెళ్ళితే ప్రభుత్వం మాకు కారును ఏర్పాటు చేయాలి.
విలేఖరి : మీకు సైడ్ ఇంకంలాంటివి ఏమైనా ఉన్నాయా?
భిక్షగాడు :ఇది మీరు అడగకూడని ప్రశ్న? నేను చెప్పకూడని జవాబు, సైడ్ ఇన్ కం అంటే పైరాబడిఆదాయం అనికుంటా! మేము పార్ట్ టైముగా రాత్రివేళ్ళలో దొంగతనాలు చేసి పాతికో-పరకో సంపాదించుకుంటాం. అంతే కాక ఇంటి బయట ఆరవేసిన బట్టలు, వంట సామాన్లు కాజేస్తుంటాము.
విలేఖరి : మీరు ఇన్ని చక్కటి విషయాలు ఎన్నింటినో మాకు చాలా ఓపికతో వివరించారు. ముష్టి ఎత్తుకోవడంలో ఉన్న ఆనందం గూర్చి మీరు వివరిస్తుంటే వినేవారికి కూడ ముష్టిఎత్తుకోవాలి. అనే అంత అద్భుతంగా మీ ప్రసంగాన్ని సాగించారు. మీకు నా తరపున ధన్యవాదాలు.
భిక్షగాడు : ఆ మంచిదండీ పాతికో - పరకో ఉంటే ఇలా పడేసి వెళ్ళండి బాబయ్యా!
విలేఖరి : ఇంకా ఇక్కడే ఉంటే నన్నుకూడ ముష్టిసంఘంలో సభ్యునిగా చేర్చుకోగలదిట్ట-విలేఖరి - పరుగో- పరుగు.
28 July 2006
భిక్షగాడితో విలేఖరి ఇంటర్వూ
Labels:
తెలుగు