ఏ మార్గంలోనూ సాధ్యం కాని పనిని మనం మంచిగా మర్యాదగా సాధించుకోవచ్చు. మర్యాద తెలియని మనిషి ఎంత చురుకైన వాడైనా జీవితంలో ఉన్నత సోఫానాలు అధిరోహించలేడు. చురుకుదనం లేని మనిషి కూడా మర్యాద రామన్న అయితే చాలు ఎంచక్కటి విజయాలు సాధించేయగలడు. తెలివి తేటలు లేని మనుషులు కూడా వాళ్ళ పనులు చిన్నచిన్న మర్యాద చిటుకులతో చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇది మనం గమనించే అంశమే దీని కోసం మీరు వెచ్చించే పెట్టుబడి ఏమి ఉండదు. పొందే లాభం మాత్రం అపారం. మర్యాద అన్నది ఒక కళ, దీనికి వయః పరిమితులు ఉండవు. ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు. మర్యాద అంటే ఓ దయాగుణం, ఓస్నేహ హస్తం, ఓ మెత్తని పలకరింపు ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓ చల్లని చిరునవ్వు , ఓ మనఃపూర్వక కృతఙ్ఞత మర్యాదకు కావలసిన తొలి అర్హత అణకువ. మనం చల్లే విత్తనాలు ఒకనాటి వృక్షమై వేళ్ళు విస్తరించి ఇతరుల దృష్టిలో మనల్ని ఉన్నతాసనం మీద కూర్చుండ బెడతాయి.
“మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేది”
“మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేది”