03 February 2007

వెండితెర వేల్పులు, చిరంజీవులు.

అయ్య..! బాబోయ్ నా మతి చెడింది. సినిమా సినిమా అన్న వాళ్ళకి మంచి సినిమా అది. అసలు నన్నడిగితే ఇది గనక విడుదల చేస్తే వంద సంవత్సరాల ఉత్సవాల వేడుక వరకు నడుస్తది. సినిమా ఇండుస్త్రీకి చాలా లాభాలు వస్తాయంటాను.. ఇన్ని రోజులు మనం స్క్ర్రీన్ పై వాళ్ళ వేషాలు చూసి ఎంతో మంచి వాళ్ళని నమ్మి మోసపోయాము. వీళ్ళేదో మర్యాద తెలిసిన వ్యక్తులనుకున్నాను. ఆదర్శమూర్తులనుకున్నాను.(నాకు ఆవేశం ఎక్కువ క్షమించాలి).ఏది ఏమైనా అందరి సినిమాలు వెండి తెర మీద చూపించే వాళ్ళు. వాళ్ళ సినిమా బుల్లి తెర మీద చూపించారు.. నమ్మలేకున్నాను.. అసలు నాకో విషయం అర్థం కాదు. ఒక్కటి అడుగుతున్నాను టీవి వాళ్ళ ఇంటర్వ్యూస్ లో ఎప్పుడూ కొత్త సినిమాలు బాగలేవు పాత సినిమాలు బాగుండేవి అంటూ మన సినిమా పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు.. నైతిక విలువలు తగ్గాయని ఇంక ఏంటో చాలా విషయాలు చెప్తు తెగ బాదపడ్తున్నారు. అసలు వీల్లు పాత సినిమాలు తీసే కాలం లో ఏమైనా విలువలు పాటించారా? వాళ్ళ కాలంలో వాళ్ళు ఏదో కొత్తతనం చూపించాలని వాళ్ళు ప్రయత్నిచారు. ఇప్పుడు వీళ్ళ తరంలో వీళ్ళు కొత్త తనం కొరకు ప్రయత్నిస్తున్నారు.. ఇప్పటి వాళ్ళదేమి తప్పు లేదు.కాని ఒక విషయం మట్టికి బల్ల గుద్ది మరీ చెప్పగలను.ఎప్పుడూ కూడ తరువాతి తరాల వాళ్ళే తెలివిగలవారు.. సరే.. మన సినిమా హీరోల గురించి మాట్లాడితే వీళ్ళు నిజంగా నాలాంటి వాళ్ళందరకి ఆదర్శమూర్తులే. నిజంగా సినిమా అంటే మంచి రిలీఫ్ అనిపిస్తుంది.. నాకు మూడ్ బాగలేకుంటే వెంటనే మంచి హీరోయిన్ ఉన్న సినిమాకి వెళ్తాను. ఇక బయట నిజ జీవితంలో అలాంటి హీరోయిన్ కొరకు వెదుకుతాను.. ఇంకా నా వయసు 22 సంవత్సరాలు మాత్రమే కాబట్టి. ఇదంతా ఎందుకంటే సినిమా ప్రభావం మనుషుల పై ఎంతవరకు పడుతుంది అని తెలియ జేయటానికి. కాని సినిమా ఇండుస్త్రీ చాలా విధాలుగా నిరుద్యోగాన్ని భర్తీ చేస్తుంది. రాజకీయానికి సినిమాకి చాలా దగ్గరి సంబంధం ఉంది.

చెప్పేది చేయరు, అర్థికంగా ఎదుగుతారు.

మల్లీ అదేంటో గాని సినిమా వాళ్ళంటే విపరీతమైన పబ్లిసిటీ. వాల్లెన్ని తప్పులు చేయని ప్రేక్షకుల మదిలో మట్టికి గొప్పవాల్లు. సల్మాన్ ఖాన్ మరియు మొనికా బేడి వీల్లు సినిమా వాల్లే. కాని సల్మాన్ ఖాన్ కి హైదరాబాద్ లో విశేష నీరాజనాలు. అశేష అభిమానులు.ఇదంతా చూస్తే సినిమా అంటే ఎంత వెర్రో అర్థమౌతుంది.

ఇంకా చెప్పాలంటే కాలనాళిక. బాగానే ఉంది కాని ఇంక 25 సంవత్సరాలకు ఎన్ని మర్పులు వస్తాయి ఎవరు ఊహించగలరండి.నా అనుమానం సినిమా ఇండుస్త్రీ ఉంటుందా? అని. ఉన్నా ఆంధ్రా సినిమా తెలంగాణా సినిమా అన్న చీలికలు రాకుండ ఉంటాయా? అప్పుడు ఆ కాలనాళిక ఏ ప్రాంతానిది.. ఇప్పుడు ప్రతీ జిల్లాల్లో సినిమాలు స్వంత ప్రొడక్షన్ లో తీస్తున్నారు..
ఉదా:సింగరేణి తరంగాలు రామగుండలో

బహుశా అలా జరకుండా జాగ్రత్తపడతారేమో. నిజంగా సినిమా వాల్లు చిరంజీవులు..ఎప్పుడూ తెరపై బ్రతికే ఉంటారు నిజ జీవితంలో చనిపోతూ ఉంటారు..నిత్య నూతన యవ్వనమంటే అదేనేమో.